డిచ్పల్లి, ఏప్రిల్ 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని అమలుచేస్తూ పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని మెంట్రాజ్‌పల్లిలో ఉన్న జడ్పీహెచ్ఎస్లో మంగళవారం నిర్వహించిన ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి బాజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌తో కలిసి పాఠశాలలో నూతనంగా చేపట్టనున్న పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు పాఠశాలల అభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణలో పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలన్నారు. మెంట్రాజ్‌పల్లి పాఠశాలకు సుమారు రూ.6.06 లక్షలు, ఎంపీపీఎస్ మెంట్రాజ్పల్లికి రూ.5లక్షల 51 వేలు మంజూరు చేశామన్నారు.
మొదటి విడుతలో భాగంగా మండలంలోని 22 జడ్పీహెచ్ఎస్, 6 ఎంపీపీఎస్ 15 ఎంపీయూపీఎస్ పాఠశాలలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశామన్నారు. డీఆర్డీవో చందర్‌నాయక్, జడ్పీటీసీ దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య, మెంట్రాజ్‌పల్లి పీఏసీఏస్ చైర్మన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీహెచ్.శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నారాయణరెడ్డి, ఇందల్వాయి ఎంపీపీ రమేశ్‌నాయక్, ఇందల్వాయి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు దాసు, ధర్మారం పులి వెంకటేశ్వర్రావు, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, పద్మారావు, రవివర్మ, భూమేశ్, సుద్దులం సర్పంచ్ వెంకటేశ్, ఆనంద్, ననీన్, పవన్, యూసుఫ్, నయీమ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.