నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 18: జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు సోమవారం ప్రారంభించారు. భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో జడ్పీటీసీ రవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మనాయక్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీడీవో రాజేశ్వర్, సర్పంచ్ అయేషా ఫిర్దోస్ అతీఖ్, ఎంపీటీసీ సుర్జిల్, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ఆర్ఐ ధనుంజయ్ పాల్గొన్నారు.
మోర్తాడ్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మోర్తాడ్ సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సొసైటీ ఉపాధ్యక్షుడు దడివె నవీన్, సీసీ మహేందర్ పాల్గొన్నారు. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ ప్రారంభించారు. బోధన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఉద్మీర్ లక్ష్మణ్, బోధన్ వీడీసీ చైర్మన్ సింగం బాగారెడ్డి యాదవ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి పురియా నాయక్, ఏఎంసీ డైరెక్టర్ జాడె సతీశ్, టీఆర్ఎస్ బోధన్ మండల అధ్యక్షుడు గోనినేని నర్సయ్య పాల్గొన్నారు.
ఎడపల్లి మండలంలోని అంబం(వై)లో బోధన్ ఏఎంసీ అధ్యక్షుడు వీఆర్ దేశాయ్, ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ పిస్క గంగాప్రసాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేరెడి శ్రీరాం పాల్గొన్నారు. బోధన్ మండలంలోని సాలూరా, హున్సా, సంగం గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సాలూరా సొసైటీ చైర్మన్ అల్లే జనార్దన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి బస్వంత్‌రావు పటేల్, బుయ్యన్ సురేశ్, సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట, దండిగుట్ట, బాగేపల్లి, నీలా, బోర్గాం, అంబేద్కర్‌నగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ, ఎంపీపీ రజిని సోమవారం ప్రారంభించారు.
నీలా విండో చైర్మన్ ఇమ్రాన్బేగ్, రెంజల్ చైర్మన్ ప్రశాంత్, సర్పంచులు రాజు, సాయిలు, వాణి, రమేశ్‌కుమార్, ఖలీంబేగ్, శ్రీదేవి, మథురాబాయి, ఏవో శ్రీనివాస్‌రావు, ఏపీఎం చిన్నయ్య పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మాధవ్‌నగర్, గుండారం, మల్కాపూర్(ఏ), జలాల్పూర్ గ్రామాల్లో సహకార సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధర్పల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, బొల్లెంక సుమలత ప్రారంభించారు. సొసైటీల చైర్మన్లు దాసరి శ్రీధర్, నాగేశ్వర్రావు, వైస్చైర్మన్లు సత్యంరెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొల్లెంక గంగారెడ్డి, ఎంపీటీసీలు అంకల గంగాధర్, సాయన్న, ఆమని, సర్పంచులు లక్ష్మణ్‌రావు, సుప్రియ, కార్పొరేటర్ ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.
మోపాల్ మండలంలోని బాడ్సి సొసైటీ ఆధ్వర్యంలో బాడ్సితోపాటు ముదక్పల్లి, సింగంపల్లి, నర్సింగ్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ప్రారంభించారు. బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్‌రెడ్డి, ఎంపీపీ లతాకన్నేరామ్, జడ్పీటీసీ కమలానరేశ్, రైతు బంధు సమితి సభ్యుడు శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తహసీల్దార్ వీర్‌సింగ్, సర్పంచులు సిద్ధార్థ, ముత్యంరెడ్డి, సాయారెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ మైలారం గంగారెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ రాజు, గంగాధర్, లింబాద్రి పాల్గొన్నారు.
కంట్రోల్‌రూం ఏర్పాటు
నిజామాబాద్‌సిటీ, ఏప్రిల్ 18 : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూం 08462-220185 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.