మాక్లూర్, ఏప్రిల్ 17: రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవొద్దని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మండలంలోని కల్లడి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన వైస్ ఎంపీపీ సుక్కి సుజాతతో కలిసి సొసైటీ ఆవరణలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మోసం చేసినా.. కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా ముంచుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోనె సంచులు, ట్రాన్స్‌పోర్టుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విండో వైస్ చైర్మన్ రమేశ్, నాయకులు సుక్కి సుధాకర్, మణిగౌడ్, రైతుబంధు సమితి సభ్యురాలు బాశెట్టి సుమలత, జీవనన్న యువసేన మండల అధ్యక్షులు రంజిత్, మోహన్, డైరెక్టర్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
మోర్తాడ్ సొసైటీ పరిధిలోని మోర్తాడ్, వడ్యాట్, తిమ్మాపూర్, పాలెం గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగి వడ్లు కొనేందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్స దేవన్న, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచులు వెల్మరూప, భోగ ధరణి, సంతోష్, గడ్డం చిన్నారెడ్డి, ఎంపీటీసీలు కళావతి, రాజ్‌పాల్, ఆస్మా, నాయకులు భోగ ఆనంద్, వెల్మ రవీందర్, జేసీ గంగారెడ్డి, చొక్కాయి గంగారెడ్డి, రాజేశ్వర్, గంధం మహిపాల్, ఎనుగందుల అశోక్, పల్గిరి రవి, శంకర్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం విక్రయాల్లో రైతుల ఆందోళన వద్దు..
ఎడపల్లి, జైతాపూర్ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, బోధన్ ఏఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం విక్రయాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, జైతాపూర్ సింగిల్‌విండో అధ్యక్షుడు నారాయణ, ఏవో సిద్ధి రామేశ్వర్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు కరణం శంకర్రావు, నాయకులు న్యావనం ది సుభాష్, జనగం మోహన్‌రెడ్డి, నాయు డు పోతన్న, పోల సాయారెడ్డి, మచ్కూరి గంగాధర్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి..
మండలంలోని మినార్పల్లిలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్ మేట్ల రవి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మానిక్ వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. సొసైటీ కార్యదర్శి హన్మాండ్లు, ఉపసర్పంచ్ భూమన్న, తారాచంద్ నాయక్, షాకీర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవొద్దు..
మండలంలోని నాగేపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్ శైలేష్కుమార్తో కలిసి ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మువ్వ నాగేశ్వర్రావు, సర్పంచ్ స్వరూప, నాయకులు నీరడి బుచ్చన్న, మహిపాల్, శంకర్, సొసైటీ కార్యదర్శి రమేశ్, సిబ్బంది శేఖర్ తదితరులు పాల్గొన్నారు.