ఆర్మూర్, ఏప్రిల్ 16: ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం రానున్నారు. అంకాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొననున్నారు. అంకాపూర్ గ్రామంలో రూ.25లక్షలతో నిర్మించిన వీడీసీ కాంప్లెక్స్ ప్రారంభించనున్నారు. అనంతరం రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేసి పలు కులసంఘాల భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అంకాపూర్‌లో పేదలకు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్సీ కల్వకవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరిశీలించనున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితాపవన్, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, అంకాపూర్ సర్పంచ్ మచ్చర్ల పూజితా కిశోర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గంగారెడ్డి శనివారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.