ఆర్మూర్, ఏప్రిల్ 8 : ప్రభుత్వ రంగ సంస్థలను దోచేస్తున్న కార్పొరేట్ గద్దల సేవలో తరిస్తున్న కేంద్ర ప్రభు త్వ పెద్దలు వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రైతులు పండించిన వడ్ల ను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రైతులతో కలిసి ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం రైతులకు ప్రాణసంకటంగా మారిందని విమర్శించారు. తెలంగాణ రైతుల పోరాటాలకు విలువ లేదా ? తమ బతుకంతా ఉద్యమాలేనా? అని ప్రశ్నించారు. 60 ఏండ్లు గోసపడి రాష్ట్రం వచ్చి కుదుటపడుతున్న సమయంలో పజల బతుకులను బీజేపీ ప్రభుత్వం మళ్లీ రోడ్డున పడేసే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ దేశానికి పట్టిన శని అని పేర్కొన్నారు.
ఢిల్లీని కదిలించి వడ్లు కొనిపిస్తామన్నారు.రైతులపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వా న్ని ఇంటికి సాగనంపే రోజు ఎంతో దూరం లేదన్నారు. ఆరు నెలుగా రైతులు పోరాడుతుంటే కేం ద్రం స్పందించడం లేదన్నారు. రైతుల తరఫున కేంద్రం తో పోరాడాల్సిన రాష్ట్ర బీజేపీ నాయకులు సిగ్గు ఎగ్గూ లేకుండా ఢిల్లీలో చెక్కభజన చేస్తున్నారని విమర్శించా రు. తొండి సంజయ్ సొల్లు పురాణం, అరగుండు అ ర్వింద్ బూతు పురాణం వినిపిస్తున్నాడని మండిపడ్డా రు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి పట్టపగలే పారిపోయి న లంగ, లఫంగ, లత్కోర్ ఎంపీ, ట్రిపుల్-ఆర్ బీజేపీ ఎమ్మెల్యేలు పత్తా లేకుండా పోయారన్నారు. బీజేపీ రైతుల కడుపు కొడుతుంటే కాంగ్రెస్ రైతుల గుండెల మీద తన్నుతున్నదన్నారు.రాష్ట్రంలో రైతాంగానికి అండ గా నిలబడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని జీవన్‌రెడ్డి అన్నారు. 23 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే ప్రథ మ స్థానంలో నిలిచిన తెలంగాణ మిగతా రాష్ర్టాలకు రోల్‌మోడల్‌గా మారిందన్నారు. ఇది ఓర్వలేక కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రతి ఇంటిపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పి.నరేందర్, మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.