బాన్సువాడ టౌన్, ఆగస్టు 1: కరోనా బారిన పడిన బీఎస్సీ న ర్సింగ్ కళాశాల విద్యార్థినులకు ప్ర తిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. క్వారంటైన్ గదులను శానిటైజ్ చేయాలని సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో కొం దరు విద్యార్థినులు కరోనా బారిన పడగా..వారిని సోమవారం సభాపతి పరామర్శించారు.మిగితా విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కరోనా బారిన పడిన విద్యార్థినులకు ప్రతిరోజూ వైద్యులతో చెకప్ చేయించాలని, వారికి పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా ప్రభావం అంతగా లేదని, విద్యార్థులెవరూ భయాందోళన చెందనవసరం లేదన్నారు. ఎలాంటి సహాయ, సహకారం కావాలన్నా తానున్నానని భరోసా ఇచ్చారు.
ప్రతిరోజూ విద్యార్థినుల ఆరోగ్య వివరాలను తెలుసుకుంటూ వారికి ధైర్యం అందించాలని వ్యక్తిగత సహాయకుడు భగవాన్ రెడ్డికి సూచించారు. స్పీకర్ వెంట బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, కౌన్సిలర్ లింగమేశ్వర్ తదితరులు ఉన్నారు.