NDSL | ఎన్డీఎస్ఎల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. ఎన్డీఎస్ఎల్ మెయిన్ గేట్ ఎదుట కార్మికుల ధర్నా
బోధన్ పట్టణం శక్కర్ నగర్ లో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసి కార్మికుల జీవితాలను రోడ్డుపై పారవేశారని కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్ రవిశంకర్ గౌడ్ ఆరోపించారు. శక్కర్ నగర్ లోని ఎన్ డి ఎస్ ఎల్ మెయిన్ గేట్ ఎదుట ఎంఐఎం పార్టీ నాయకులతో కలిసి శనివారం ధర్నా చేపట్టారు.
- ఎన్నికల హామీని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- అర్ధాంతరంగా మూసిన నిజాం చెక్కరకర్మాగరం
NDSL | శక్కర్ నగర్ : బోధన్ పట్టణం శక్కర్ నగర్ లో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసి కార్మికుల జీవితాలను రోడ్డుపై పారవేశారని కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్ రవిశంకర్ గౌడ్ ఆరోపించారు. శక్కర్ నగర్ లోని ఎన్ డి ఎస్ ఎల్ మెయిన్ గేట్ ఎదుట ఎంఐఎం పార్టీ నాయకులతో కలిసి శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటుపరంగా కొనసాగుతున్న నిజాం చక్కర కర్మాగారాన్ని యాజమాన్యం ఎలాంటి సమాచారం లేకుండా లే ఆఫ్ ప్రకటించి సుమారు 11 ఏండ్లు పూర్తయిన కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని మరిచిందని ఆరోపించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ప్రారంభంలో ఓ సమావేశం నిర్వహించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
బోధన్ ప్రాంత అభివృద్ధికి, పలువురు ఉపాధికి మార్గదర్శకంగా కొనసాగిన ఫ్యాక్టరీ మూసివేత కారణంగా బోధన్ బొందల గడ్డ గా మారిందని వారు ఎద్దేవా చేశారు. ఫ్యాక్టరీ మూసివేసిన నాటి నుంచి కార్మికులకు అందాల్సిన బెనిఫిట్స్ తో పాటు వేతనాలు కూడా లేక కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు రావలసిన వేతనాలను ప్రభుత్వం ఇప్పించి న్యాయం చేయాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బోధన్ చక్కెర ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడిన ఎంఐఎం ఎమ్మెల్యే బల్లాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్, నాగుల రవిశంకర్ గౌడ్, బాలకృష్ణ, ఈరవేణి సత్యనారాయణ, ఎంఐఎం నాయకులు రఫీక్ సమీర్,కార్మికులు రాం బాబు, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

