నిజాంసాగర్, అక్టోబర్ 7: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 21 వరకు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపాల్ రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖా స్తు గడువు ఈనెల 7వ తేదీతో ముగియగా..గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10వ తరగతులు చదివేవారు అర్హులని తెలిపారు. 2026 ఫిబ్రవరి 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఆసక్తి ఉన్న విద్యార్థులు htpps:/ www. navodaya.gov.in ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసుకోవాలని సూచించారు.