Nandeeshwara Puja | శక్కర్ నగర్: శ్రావణమాసం అమావాస్య సందర్భంగా శుక్రవారం ఎడ్ల పొలాల పండగలో భాగంగా బోధన్ పట్టణంలోని మారుతి మందిరం వద్ద నందీశ్వర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ పూజా కార్యక్రమాలను జరిపించారు. ప్రతీ ఏటా ఆనవాయితీలో భాగంగా నిర్వహించే నంది పూజ కార్యక్రమాలకు పట్టణంలోని దేశాయ్ అజయ్ వడియార్ స్వగృహం నుంచి నందీశ్వరులను (ఎడ్లను ) ప్రత్యేకంగా అలంకరించి మారుతి మందిరానికి తెచ్చారు. ఈ సందర్భంగా సాయంత్రం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వీడీసీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారి, మారుతీ, చక్రేశ్వర శివ మందిరాల చైర్మన్లు గుండేటి శంకర్,గుండేటి శంకర్, శ్రీకాంత్ చారి, ఆలయ ఈవో రాములు పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ నాయిని కృష్ణ, అంకుదామోదర్, సంతోష్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, బోదు శేఖర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.