Muslim rally | మద్నూర్ : మండల కేంద్రంలో శుక్రవారం ముస్లిం సోదరులు ఉగ్రదాడికి నిరసనగా జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పాహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేయడంతో అందుకు నిరసనగా వారు జమ మస్జిద్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఎటువంటి వారైనా ఎంతటి వారైనా ఉగ్రవాద ముసుగులో మతకొల్లాలు సృష్టిస్తే వారిని వదిలి పెట్టొద్దని ముస్లిం మత పెద్దలు అన్నారు.
తమ దేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదని, అందరు కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాలని అన్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జావిద్ పటేల్, షకీల్, బాబా, అస్లాం, ఖలీల్, సుఫి, హిందూ సోదరులు విజయ్ కుమార్, లక్ష్మణ్, కృష్ణ తదితరులు ఉన్నారు.