ఎల్లారెడ్డి రూరల్ : మాతృభాషను (Mother tongue) నిర్లక్ష్యం చేయవద్దని, ఎన్ని భాషలు ఉన్నా మాతృభాష తల్లితో సమానమని నలంద కళాశాల ప్రిన్సిపాల్ సంగ్రామ్ (Principal Sangram) అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని నలంద కళాశాలలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసికందుకు తల్లిపాలు ఎంత ముఖ్యమో, విద్యార్థులకు మాతృభాష అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయవద్దని ఆయన విద్యార్థు లకు సూచించారు . విద్యార్థులకు తెలుగు భాషా ప్రాధాన్యతను వివరించారు. మాతృభాషను మరువనంతవరకు విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులున్నారు.