నందిపేట్, జూన్ 5 : మండలంలోని చౌడమ్మ కొం డూర్ గ్రామంలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నర్సింహాస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత దంపతులు, కుటుంబ సభ్యు లు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ తృతీయ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతు న్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన హోమం, స్వామివారి కల్యాణోత్సవంలో కవిత కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతూకిరణ్, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, మాజీ జడ్పీటీసీ యమున, బినోల విండో చైర్మన్ హన్మాండ్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, నాయకులు ఉల్లి శ్రీనివాస్‌గౌడ్, భూమేశ్, రాజన్న, దినేశ్ పాల్గొన్నారు.