ముప్కాల్, నవంబర్ 17: మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉషూ పోటీలు నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ, స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉషూ పోటీలను ఆదివారం నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి వేముల హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కరోజు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్, వీడీసీ అధ్యక్షుడు సిద్ధ రమేశ్, ఏలేటి గంగారెడ్డి, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు మోతె గంగారెడ్డి, కె.గంగాధర్, అంజయ్య, ఫిజికల్ డైరెక్టర్ రాజ్‌కుమార్, మల్లేశ్‌గౌడ్, టి.సాయన్న, జోగు నర్సయ్య, సంజీవ్, థామస్, యువజన సంఘం నాయకులు మధుకర్, సాయిలు, గంగరాజ్, హరీశ్, ముస్కు శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.