బాన్సువాడ, డిసెంబర్ 13: స్పీకర్ ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ఘన త బాన్సువాడ నియోజకవర్గ ప్రజలదే అని బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం లో అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ బా న్సువాడ అని తెలిపారు. బీర్కూర్ చౌరస్తాలోని ఎస్ఎంబీ గార్డెన్లో బుధవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల కృతజ్ఞత సభ, ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసిన వ్యక్తులు అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆనవాయితీ వస్తున్నదని అన్నారు. దానిని బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు తిరగరాశారని చెప్పారు. తన గెలుపునకు రాత్రింబవళ్లు కష్టపడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మండలాల వారీగా వచ్చిన మె జార్టీని ఎమ్మెల్యే చదివి వినిపించారు. తాను ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వెళ్తే.. అందరూ చూశారని, ఏంటని ఆరా తీస్తే.. అసెంబ్లీ స్పీకర్లు ఓడిపోతారు కదా అన్నారన్నారు. తాను గెలువడంతో ఆశ్చర్యం వ్యక్తంచేశారని చెప్పారు. పోలై న ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించి తా ను గెలుపొందానని అన్నారు. అసెంబ్లీ లో బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతామని తెలిపారు.
రేవంత్రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోగానే రూ.రెండు లక్షల రుణమాఫీ అన్నారని, డిసెంబర్ 9న రైతుబంధు రూ.15వేలు ఒకేసారి వేస్తామని చెప్పారని, ప్రస్తుతం రూ.పది వేలు ఇస్తున్నారని అన్నారు. ముందున్నది ముసళ్ల పండుగ అని తెలిపారు. అత్యధికంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తుల్లో మాజీ సీఎం కేసీఆర్ మొదటి వ్యక్తి కాగా.. తాను రెండో వ్యక్తి ని అన్నారు. త్వరలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు గులాబీ సైన్యం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మీరే నా బలం అని.. ఎవరికీ భయ పడాల్సిన అ వసరం లేదని కార్యకర్తలకు సూచించా రు. 2014లో రవీందర్రెడ్డి బీఆర్ఎస్ ఎ మ్మెల్యేగా ఉన్నాడని, ప్రభుత్వం నుంచి ఒక్క డబుల్ బెడ్రూం కూడా మంజూ రు చేయించి తన స్వగ్రా మం ఎర్రాపహాడ్లో కట్టించలేదన్నారు. శ్రమించి ఇండ్లు కట్టించిన నాయకుల గురించి మాట్లాడడం సరికాదన్నారు. ఏనుగు రవీందర్రెడ్డి చిల్లర రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేను పలువురు నాయకులు సన్మానించారు.