హైదరాబాద్ : పీయూసీ చైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు.