IND vs WI : తిరువనంతపురం వన్డేలో భారత టాపార్డర్ దంచేస్తోంది. వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(32) విఫలమైనా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(71 నాటౌట్) అర్ధ శతకం బాదేశాడు. విండీస్ బౌలర్లను ఎడాపెడా ఉతికేస్తూ గిల్ వన్డేల్లో 21వ హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ(38 నాటౌట్) సైతం దూకుడు పెంచి క్లాస్ ఆటతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వీరిద్దురి జోరుతో టీమిండియా వడివడిగా లక్ష్యం దిశగా సాగుతోంది.
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(71 నాటౌట్) రెచ్చిపోయాడు. విండీస్ బౌలర్ల భరతం పడుతూ అర్ధ శతకంతో కదం తొక్కాడు. 296 పరుగుల ఛేదనలో దూకుడుగా ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ(32) ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. బౌండరీ వద్ద అల్జారీ జోసెఫ్ క్యాచ్ జారవిడవంతో బతికిపోయిన హిట్‌మ్యాన్ పెద్ద స్కోర్ చేయలేదు. అతడు త్వరగా ఔటైనా గిల్ దూకుడైన ఆటతో స్కోర్ బోర్డును ఉరికించాడు.
ODI half-century no. 2️⃣1️⃣ for @ShubmanGill 👏#TeamIndia skipper leading from the front 🫡
Updates ▶️ https://t.co/O2cs86p4gq#INDvWI | @mflone_ pic.twitter.com/eof8V5oxsR
— BCCI (@BCCI) September 27, 2026
తనదైన షాట్లతో అలరిస్తూ.. ఈ ఫార్మాట్లో 21వ ఫిఫ్టీ సాధించాడు గిల్. రోహిత్ ఔటయ్యాక విరాట్ కోహ్లీ(38 నాటౌట్) జతగా హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో 23 ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది. సిరీస్‌లో బోణీ కొట్టడానికి భారత్ ఇంకా 154 రన్స్ కావాలి.