చిక్కడపల్లి : కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ఎస్టీ డిక్లరేషన్‌ను ( ST Declaration ) తక్షణమే అమలు చేయాలని నంగారా బేరీ లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ధరావత్ గణేష్ నాయక్ ( Ganesh Naik ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన ధరావత్ గణేష్ నాయక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు రాజ్‌కుమార్, ఎపీ రాష్ట్ర అధ్యక్షు ముడవత్ రవీందర్ నాయక్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు సుశీల బాయ్ తదితరులు ఎన్నికయ్యారు.
ధరావత్ గణేశ్ నాయక్ మాట్లాడుతూ ఇచ్చిన హమీలు అమలు చేయకపోతే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తామని హెచ్చరించారు. గిరిజనులు రాజకీయంగా అణగ దొక్కాలనే గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.
కార్యక్రమంలో నాయకులు పూల్ సింగ్ నాయక్, పరుశురాం నాయక్, సుహాసిని, శివాణీ, తనిష్క, సుశీల, ఇందల్ రాథోడ్, వెంకట్ బంజార, రాజ్‌కుమార్,జైపాల్ నాయక్, బాలు నాయక్, హారీ నాయక్, తదతరులు పాల్గొన్నారు.