భీమ్‌గల్/ వేల్పూర్, అక్టోబర్ 21 : వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం వివిధ మండలాలకు చెందిన పలు సంఘాలు, కులస్తులు తీర్మానాలు చేసి పత్రాలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అందజేశారు.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి భీమ్‌గల్ మండలంలోని పల్లికొండకు చెందిన మాదిగ యువజన సంఘం, మాల సంఘం సభ్యులు తమ మద్దతు తెలుపుతామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన ప్రతులను తెలంగాణ ఫ్యామిలీ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దళితుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నారని, తమ కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలం మండలంలోని రామన్నపేట్ గ్రామంలోని కుమ్మరి శాలివాహన సంఘం సభ్యులు శనివారం సమావేశమయ్యారు. ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి తమ మద్దతు అందజేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన కాపీని ఆర్టీఏ సభ్యుడు రేగుల రాములుకు అందజేశారు.
ఇందల్వాయి, అక్టోబర్ 21 : మండలంలోని నల్లవెల్లికి చెందిన యాదవ సంఘ సభ్యులు బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతు తెలుపుతూ శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన పత్రాన్ని డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, సర్పంచ్ నోముల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ అంజయ్యకు అందజేశారు. నల్లవెల్లి గ్రామానికి చెందిన మున్నూరుకాపు సంఘ సభ్యులందరూ బాజిరెడ్డి గోవర్ధన్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన కాపీని నాయకులకు అందజేశారు.