ఆర్మూర్ : రాష్ట్రంలో ప్రతిపక్షాల ఆరోపణలను, విమర్శలను సమర్ధవంతంగా మీడియా ద్వారా తిప్పికొడుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డిని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీలో ఆవరణలో కలుసుకున్న జీవన్‌రెడ్డిని ‘శభాష్ తమ్మ’ అని మెచ్చుకుని కేటీఆర్ అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వంపై , మంత్రులపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు చేస్తున్న ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలను ప్రెస్మీట్ల ద్వారా జీవన్‌రెడ్డి సమర్ధవంతంగా ఎదుర్కొనడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్పష్టంగా వివరిస్తున్నందుకు కేటీఆర్ ఆయనను అభినందించారు.