నందిపేట్/మాక్లూర్/ రెంజల్, నవంబర్ 17: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. రెంజల్ మండలం సాటాపూర్‌లో ఉదయం 11గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేటలో నిర్వహించే రోడ్‌షోలో హరీశ్‌రావు ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం మాక్లూర్ మండలం మానిక్‌బండార్ గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రచారసభకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. మంత్రి హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో బోధన్, రెంజల్, నవీపేట, నందిపేట, మాక్లూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు.