బాన్సువాడ : మేరు వృత్తిపై (Meru professional) ఆధారపడి జీవిస్తున్న 50 సంవత్సరాలు నిండిన వారికి రూ.3వేల నెలసరి పింఛన్ (Pension) ఇవ్వాలని బాన్సువాడ మేరు సంఘం నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. టైలర్స్ డే ( Tailor Day ) సందర్భంగా శుక్రవారం బాన్సువాడలో మేరు సంఘం అధ్యక్షులు హనుమాండ్లు మాట్లాడుతూ మేరు వృత్తి దర్జీ కార్మికులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ( Double Bedroom) ఇల్లు కట్టించాలని కోరారు.
అధునాతనమైన యంత్రాలు అందజేయాలని, ఉచిత శిక్షణ ఇప్పించి గుర్తింపు కార్డు సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. ప్రతి ఒక్కరికీ రూ. 10 లక్షల రుణం నేరుగా ఇప్పించి 80 శాతం సబ్సిడీతో ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు , సంక్షేమ హాస్టళ్లు, తదితర ప్రభుత్వ శాఖల వారి యూనిఫాం కుట్టించే పనిని స్థానిక మేరు కులస్తుల సంఘాల వారికి మాత్రమే కల్పించాలని విన్న వించారు.
మే రు ఫెడరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ. 100 కోట్ల కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు పెండ్యాల భాస్కర్, కొట్టురి మహేష్, అంబిక సురేష్, మాజీ అధ్యక్షులు కొత్తకొండ దేవదాస్, మండల కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం కోటి మహేష్, కార్యవర్గ సభ్యులు శిలామికోటి నందు కుమార్, శీలం కోటి సంతోష్, కోనాపూర్ వెంకటి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.