పెద్ద కొడప్గల్ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్యను అందించాలని మండల ప్రత్యేక అధికారి కిషన్ (Kisan) సూచించారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం అమలు చేస్తున్నారా అని ప్రిన్సిపల్ సునీతను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
స్టోర్ రూమ్(Store Room), స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు చదువు, నాణ్యమైన భోజనం, నిత్యవసర సరుకులు తదితర అంశాలపై ప్రిన్సిపల్ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎండలు ఎక్కువ అవుతున్నందున పాఠశాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి, ఏపీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.