సిరికొండ : మానవ జీవితం లెక్కలతో ముడిపడి ఉందని , పుట్టుక మొదలు కడ వరకు గణితమే మనిషి జీవితమని సత్యశోధక్ ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య (Principal Narsaiah) అన్నారు. అంతర్జాతీయ గణిత దినోత్సవం 9Mathematics) , పై దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులు పై ఆకృతిలో కూర్చొని గణితశాస్త్ర ఆకాంక్షను తెలియపరిచారు.
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక క్రమశిక్షణన, దృఢత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆధునిక సాంకేతిక పోటీ ప్రపంచంలో నవీన ఆవిష్కరణలకు మూలము గణితశాస్త్రమని అన్నారు. గణితశాస్త్రంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉండే వివిధ భావనలలో ఒకటి పై (π) అని, వృత్తం యొక్క చుట్టుకొలత దాని వ్యాసం యొక్క గణిత నిష్పత్తి అని అన్నారు. వృత్తం యొక్క వైశాల్యాన్ని గణించడంలో ఇది ముఖ్యమైన స్థిరాంకమని, దీని విలువ 3.14159 అని అందువలన మార్చ్ 14న అంతర్జాతీయ గణిత దినోత్సవం జరుపుతారన్నారు.
గణితశాస్త్ర ప్రాముఖ్యత గుర్తించి ప్రోత్సహించుటకు మేధావులు, గణిత ఔత్సహికులు చేస్తున్నా కృషి వేల కట్టలేదన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు పై విలువ వంద దశాంశాల వరకు లెక్కించి, పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.