Manda Krishna | పోతంగల్, ఆగస్టు 23 : ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాంను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ శనివారం పరామర్శించారు. మందకృష్ణ మాదిగ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పోచీరాం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని విషయం తెలుసుకున్నాడు.
ఈ మేరకు పోతంగల్ మండలంలోని సోంపూర్ గ్రామం పోచీరాం నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల కు ధైర్యంగా ఉండాలన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.