ధర్పల్లి కోటగిరి, డిసెంబర్ 29 : ధర్పల్లి మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉర్దూమీడియం పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు -మన బడి పనులను జడ్పీ సీఈవో గోవింద్ గురువారం పరిశీలించారు. అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఆయన వెంట ఆయన వెంట ఎంపీడీవో నటరాజ్, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సైఫుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ గంగాదాస్, పాఠశాల హెచ్ఎం సుస్మిత ఉన్నారు.
పొతంగల్ మండలంలోని కొడిచెర్ల, పొతంగల్‌లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను మండల ప్రత్యేకాధికారి రమేశ్, ఇన్చార్జి ఎంపీడీవో మారుతి గురువారం పరిశీలించారు. పనుల వివరాలను కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. జనవరి 6వ తేదీలోగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈ నాగేశ్వర్రావు, సర్పంచులు వర్ని శంకర్, పుష్పలతా భీమయ్య, ప్రధానోపాధ్యాయుడు భాస్కర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.