నిజామాబాద్ కల్చరల్/ కోటగిరి, డిసెంబర్ 31 : జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మహాభిక్ష, పడిపూజ కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది గురుస్వాములు, మాలధారులకు పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుడు విఠల రమేశ్ శర్మ అధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, పూజలు కొనసాగాయి.
కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు భక్తవత్సలం, ఆగమయ్య గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.కోటగిరి మండలంలోని లింగాపూర్‌లో సర్పంచ్ దేగం హన్మంతు స్వగృహంలో ఆదివారం రాత్రి అయ్యప్ప పడిపూజను వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మల్లయ్యగిరి, దేగలమడి ఆశ్రమ పీఠాధిపతి బసవలింగ అవధూత మహరాజ్ హాజరై పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రవచనాలు చేశారు.