నిజామాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో పారదర్శకత లోపించింది. ఉద్యోగుల బదిలీల్లో అది కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. పైరవీలు, అధికార పార్టీ నేతల సిఫారసులకే పెద్దపీట వేస్తుండడంతో అర్హతలు ఉన్న వారి కి అన్యాయం జరుగుతున్నది. ఆర్మూర్‌కు చెందిన తహసీల్దార్ ఉదంతమే అందుకు ఉదాహరణ. తీవ్రమైన డయాబెటీస్‌తో బాధ పడుతున్న ఆయనను మాటిమాటికీ బదిలీల పేరుతో చిత్రవధకు గురి చేయడంతో హఠాన్మరణం చెం దారు. తహసీల్దార్ భార్య ప్రభుత్వ టీచర్ కాగా, స్పౌస్ కేటగిరీలోనైనా ఆయనను కోరుకున్న చోటికి బదిలీ చేయాలి. ఏడాదిన్నరలోనే ఉద్యోగ విరమణ చేయనున్న ఆయన, అడిగిన స్థానం ఇవ్వకపోగా, పలుమార్లు బదిలీ చేశారు.
చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) స్థాయిలోనై నా న్యాయంగా బదిలీ చేయించుకోవాలని యత్నించినా ఫలించలేదు. ఎన్నికల కోడ్‌తో మొదటి బదిలీ కాగా, అనతి కాలంలోనే నాలుగైదు సార్లు స్థానభ్రంశం చేశారు. బాన్సువాడలో పని చేస్తుండగా, అకస్మాతుగా ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అడ్మినిస్టేషన్ ఆఫీసర్‌గా పంపించారు. ఏం జరుగు తున్నదో అర్థం కాని దుస్థితిలో తనకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర మనస్తాపానికి గురైన సదరు తహసీల్దార్ చివరకు ఊపిరి వదిలాడు. పారదర్శక త లేని బదిలీల కారణంగా తోటి ఉద్యోగి మృతి చెం దడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల వద్ద రెవెన్యూ ఉద్యోగుల సంఘ నేతల మాటకు తిరుగుండదు. ఆ నాయకులకు దక్కే విలువ కూడా అలాగే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేసీఆర్ సర్కారు చర్యలకు చీటికీ మాటికి అడ్డు పడుతూ కాళ్లలో కట్టెలు పెట్టే లా ప్రవర్తించిన కొంత మంది నాయకులు ఇప్పు డు పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ విమర్శల పాలవుతున్నారు. ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే పోరాటం చేయాల్సిన తరుణంలో సంఘం నేతలు మౌనంగా ఉండడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో ఉద్యోగుల బదిలీలు, డిప్యూటేషన్లలో ఇష్టారాజ్యం నడుస్తున్నది. ఉమ్మడి జి ల్లాల్లో పలువురికి దక్కుతున్న ఎనలేని ప్రాధాన్యత ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. నిజామాబాద్ కలెక్టరేట్లో పరిపాలన అధికారిగా ఏం డ్లుగా ఒకే వ్యక్తి తిష్ట వేశాడు. అంతకు ముందు ఓ మండలానికి తహసీల్దార్‌గా పని చేసిన సదరు వ్యక్తిని ఉన్నతాధికారులు కనీసం టచ్ చేయట్లేదు. ఈయన తన భార్యకు సైతం అనుకు న్న చోట పోస్టింగ్ ఇప్పించుకుని దర్జాగా కాలు కదపకుండానే విధులు నిర్వహిస్తున్నాడు.
రెవె న్యూ సంఘం రాష్ట్ర నాయకుడిగా ప్రచారం చేసుకునే మరో అధికారి సైతం దశాబ్ద కాలంగా జిల్లా కేంద్రాన్ని దాటి వెళ్లడం లేదు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఆయా సెక్షన్లలో పని చేసిన సూపరింటెండెంట్లు కూడా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని మంజీరా తీర ప్రాంతాల్లోని మండలాలకు బదిలీ చేయించుకున్నారు. ఒకవేళ బదిలీ జరిగితే తిరిగి ఆయా సెక్షన్లకే వచ్చి తిష్ట వేస్తున్నారు. మరోవైపు, నిజాయితీపరులుగా ముద్ర పడిన తహసీల్దార్లు ఏండ్లుగా లూప్‌లైన్ లో పని చేస్తున్నారు. వీరిని మండలాలకు పంపించట్లేదు. కామారెడ్డిలో తాజాగా జరిగిన బదిలీల్లో కళంకితులకు ఇసుక మేటలు ఉన్న మండలాలకు పోస్టింగ్‌లు దక్కాయి. ఎమ్మెల్యేల సిఫార్సులతో కొంత మంది బదిలీలు చేయించుకోవడం గమనార్హం.