Electric shock | పెద్దకొడప్గల్, ఏప్రిల్ 18 : ఇటుక బట్టీల వద్ద విద్యుత్ షాక్ తో కూలి మృతి చెందిన ఘటన జగనత్ పల్లి తాండ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక కూలీలు, ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కల్లాలి గ్రామానికి చెందిన గజానన్ (20) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని జగనాథ్ పల్లి తాండ శివారులో ఇటుక బట్టీల వద్ద కూలిగా పని చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం నాలుగు గంటల సమయంలో ఇటుక బట్టీల దగ్గర విద్యుత్ బల్బు రాకపోవడంతో దానిని సరి చేసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే పడిపోయారు. దీంతో అక్కడే పని చేస్తున్న స్థానిక కూలీలు గమనించి బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలోనే మృతి చెందారు. ఇటుక బట్టి యజమాని నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని స్థానిక కూలీలు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.