Pothangal | పోతంగల్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు
నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిగా నిలుస్తారని బీఆర్ఎస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుధాం నవీన్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
Pothangal | పోతంగల్, జులై 24 : నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిగా నిలుస్తారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుధాం నవీన్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు, మండల కేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేశారు.
అలాగే బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఎంఏ హకీం నేటి నుండి పోతంగల్ మండలంలో నిరుపేద కుటుంబంలో మొదటి కాన్పుగా ఆడబిడ్డ జన్మిస్తే తాత కానుకగా రూ.5 వేల సహాయాన్ని అందజేస్తానని కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా కేటీఆర్ చేస్తున్న కృషి అభినందించదగినదన్నారు. ఇటీవల కంటి ఆపరేషన్ చేసుకున్న గ్రామానికి చెందిన కన్నం హన్మండ్లుకు రూ.5వేల ఆర్థిక సాయాన్ని ఎంఏ హకీం అందజేశారు. ఈ కార్యక్రమంలో అరిఫ్, ఆంజనేయులు, ఎజాజ్, గంగాధర్, హన్మంతు, సుదం సాయిలు, సురేష్ పటేల్, రాములు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

