Jukkal | పెద్ద కొడప్ గల్ (జుక్కల్), జూలై 24 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేసే నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.