మంజూరుచేసిన మంత్రి కేటీఆర్
బోధన్, జూన్ 13: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని హెఎండీఏ కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సోమవారం కలిశారు.
బోధన్ మున్సిపాలిటీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కేటీఆర్ అప్పటికప్పుడు బోధన్ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారని ఎమ్మెల్యే షకీల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల విడుదలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసినందుకు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.