బాన్సువాడ టౌన్ : బాన్సువాడ పట్టణం కోటగల్లిలోని కోట దుర్గమ్మ ( Kotadurga temple ) ఆలయం ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి . మూడు రోజులపాటు కొనసాగే ఉత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం అంకురార్పణను నిర్వహించారు.
ప్రతిరోజు ఆలయంలో అర్చన అభిషేకాలు ( Abhishekas ) , హోమ యజ్ఞాలు(Homa Yagnam), ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మూడు రోజులపాటు మహా అన్నదాన ఉంటుందన్నారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో జోడు నాగుల విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విగ్రహ దాతలకు, ఆలయ నిర్మాణం దాతలకు ఆలయ కమిటి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.