బాన్సువాడ : బాన్సువాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదినాన్ని (ఫిబ్రవరి 17)పురస్కరించుకొని ఆదివారం ముందస్తుగా పట్టణంలోని ఇమ్మనియల్ చర్చిలో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ జన్మదిన(KCR birthday) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలను నాటాలని, ఒక్కొక్కకరికి మూడు మొక్కలను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సాయిబాబా, రమేష్ యాదవ్, మహేష్, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.