కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. దేశ ప్రజల రక్షణ కోసం పోరాడి అసువులు బాసిన వీర జవాన్లను స్మరించుకున్నారు.
– బోధన్, జూలై 26