నిధుల డ్రాపై సర్పంచుల నిరసన
మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తంచేశారు. పంచాయతీలకు సంబంధించిన 15వ ఫైనాన్స్ నిధులు సర్పంచులకు తెలియకుండా అధికారులు డ్రా చేయడంపై వారు నిరసన తెలిపారు.
- 15వ ఫైనాన్స్ నిధులను కార్యదర్శులు విత్‌డ్రా చేయడంపై ఆగ్రహం
లింగంపేట, డిసెంబర్ 27: మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తంచేశారు. పంచాయతీలకు సంబంధించిన 15వ ఫైనాన్స్ నిధులు సర్పంచులకు తెలియకుండా అధికారులు డ్రా చేయడంపై వారు నిరసన తెలిపారు. సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా డిజిటల్ కీ పేరిట మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ చారి, పంచాయతీ కార్యదర్శులు డ్రా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషమయమై పంచాయతీ కార్యదర్శులను ప్రశ్నించగా.. ఎంపీవో ఆదేశాల మేరకు డబ్బులు డ్రా చేసినట్లు సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీడీవో కార్యలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఎంపీవోను సర్పంచులు ప్రశ్నించారు. డబ్బులు డ్రా చేసిన విషయం వాస్తవమే అని ఆయన అంగీకరించారు. డ్రా చేసిన డబ్బులను తిరిగి పంచాయతీల అకౌంట్లలో జమ చేస్తామని ఎంపీవో సమాధానం ఇచ్చారు. తమకు సమాచారం లేకుండా డబ్బులు డ్రా చేయొద్దని సర్పంచులు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కూడా సర్పంచులతో మాట్లాడారు. ఎంపీవో ప్రభాకర్ చారిని వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డబ్బులు డ్రా చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బండి రాజయ్య, రాజశేఖర్‌రెడ్డి, సతీశ్, జీల్యా, అనిల్‌రెడ్డి, ఆశయ్య, గోవింద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ కీని సర్పంచులకు అప్పగించాలని వినతి..
15వ ఆర్థిక సంఘం నిధుల డ్రా కోసం ఏర్పాటుచేసిన డిజిటల్ కీని తమకు అప్పగించాలని మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఇన్చార్జి ఎంపీడీవో అతినారపు ప్రకాశ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు తెలియకుండానే దారి మళ్లించారని, డిజిటల్ కీల ఏర్పాటుకు సంతకాలు తీసుకున్నారని, అయినా ఇప్పటివరకు వాటిని జీపీలకు ఇవ్వలేదన్నారు. వెంటనే డిజిటల్ కీలు అందజేసి, డ్రా అయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే ఖాతాలో జమ చేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

