నిజామాబాద్ సిటీ, ఆగస్టు 14 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి స్ఫూర్తిని చాటేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న శకటాలు సమాచారాన్ని అందించేలా రూపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, జడ్పీ సీఈవో గోవింద్, తదితరులు ఉన్నారు.
కామారెడ్డి టౌన్, ఆగస్టు 14: కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆదివారం నిర్వహించే పంద్రాగస్టు వేడుకలను కలెక్టర్ శరత్ శనివారం పరిశీలించారు. స్టేడియాన్ని సందర్శించిన ఆయన స్టాళ్లను ఏర్పాటుచేసే స్థలం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదిక, గ్యాలరీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఆర్డీవో శ్రీను, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ తదితరులు ఉన్నారు.