
డిచ్పల్లి, అక్టోబర్ 9 : తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల అవుట్ సోర్సింగ్ సిబ్బంది అక్రమ నియామకాలపై విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించి న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని టీయూకు పంపించినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా కేం ద్రంలో జరుగుతున్న ఒక ఉపాధ్యాయ సం ఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని విద్యార్థి సంఘాల నాయకులు కలిసి అక్రమ నియామకాలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన దగ్గరకు ఎందుకు వచ్చారని, ఇప్పటికే యూనివర్సిటీకి విచారణ కమిటీ వచ్చిందని వారికే ఫిర్యాదు చేయాలని సూచించారు. మంత్రికి వినతి పత్రం అందించిన వెంటనే విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీకి చేరుకున్నారు.అప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన కమిటీ క్యాంపస్ నుంచి వెళ్లిపోవడంతో వెనుదిరిగారు. శనివారం సెలవు రోజు ఉండగా హైదరాబాద్ నుంచి వీసీ ప్రొఫెసర్ రవీందర్, నిజామాబాద్ నుంచి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కనకయ్య ఆదరాబాదరాగా క్యాంపస్‌కు చేరుకోవడం చర్చనీయాంశంగా మా రింది. ఈ విషయమై రిజిస్ట్రార్‌ను సంప్రదించ గా యూనివర్సిటీకి ఏ విచారణ కమిటీ రాలేదని తెలిపారు. సెలవు రోజు ఎందుకు వచ్చారని అడుగగా జిల్లాలో పీఆర్టీయూ రా ష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని, వారి లో ఒక 100 మందికి క్యాంపస్‌లో వసతి కల్పించాలని ఉన్నత విద్యామండలి తమకు సూచించిందని అందుకే తాను, వీసీ వచ్చామని సమాధానం ఇచ్చారు.
ఇంటలిజెన్స్ ఆరా..
టీయూలో అక్రమ నియామకాలపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అక్రమ నియామకాలపై వెంటనే నివేదిక అం దించాలని సీఎం క్యాంప్ కార్యాలయం నుం చి ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ని బంధనలకు విరుద్ధంగా 102 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించినట్లు విద్యా ర్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిత్యం విద్యా ర్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారులు అక్రమ నియామకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిపై సమగ్రమైన విచారణ జరిపి నివేదిక అందజేయాల్సిందిగా సీ ఎంక్యాంప్ఆఫీస్ నుంచి కోరినట్లు తెలిసింది.
మంత్రికి ఫిర్యాదు
టీయూలో జరుగుతున్న అక్రమ నియామకాలపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి శనివారం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా వచ్చిన వీసీ రవీందర్ గుప్తా ఇష్టానుసారంగా వ్యవహరి స్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా అవుట్ సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్, ప్రోగ్రామర్, ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్, సెక్యూరిటీ గార్డ్స్, హాస్టల్ వర్కర్స్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారని వారు ఆరోపించారు. యూనివర్సిటీకి నెలకు దాదాపు రూ.30లక్షల వరకు అదనపు భారం పడుతుందని అ న్నారు. అర్హులైన నిరుద్యోగులకు, ముఖ్యంగా స్థానికులకు అవకాశాలు కల్పించేలా చూడాలని, వీసీ అవినీతికి అడ్డుకట్ట వేసి అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, పంచరెడ్డి చరణ్, పిల్లి శ్రీకాంత్,రవి, జైత్రామ్ రాథోడ్, అజయ్, అఖిల్ యాదవ్, మహేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.