హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్మానించారు. అందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఏడుగురు గురువులు ఉన్నారు.
ఆర్మూర్/ఇందూరు/డిచ్పల్లి, సెప్టెంబర్ 5: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. పెర్కిట్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు సీతయ్య, నిజామాబాద్‌లోని శ్రీజ్ఞాన సరస్వతి సంగీత, నృత్య పాఠశాలలో కూచిపూడి నృత్య సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డి.ప్రశాంత్, డిచ్పల్లి మండలం యానంపల్లి స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్.మురళీధర్, టీయూలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్‌గా విధులు నిర్వహిస్తున్న అత్తర్సుల్తానా, కలిగోట్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పి.రాములు, గిరిరాజ్ కళాశాలకు చెందిన వై.వేణుప్రసాద్, ఎం.సునీత, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకుల అవార్డులు దక్కాయి. అవార్డు గ్రహీతలకు తోటి సిబ్బంది, విద్యార్థులు, నాయకులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, విద్యాశాఖ ఉన్నతాధికారులు నవీన్‌మిట్టల్, సందీప్ సుల్తానియా, ఉమర్ జబీల్ తదితరులు పాల్గొన్నారు.