రహదారులపై మితిమీరిన వేగానికి స్పీడ్‌గన్‌తో కళ్లెం
వేగ పరిమితి దాటితే జరిమానాలు తప్పవు
ప్రమాదాలను నివారించే దిశగా బ్లాక్‌స్పాట్స్ గుర్తింపు
లేజర్ స్పీడ్‌గన్ వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న పోలీసుశాఖ
సత్ఫలితాలిస్తున్న నిఘా
జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. వాహనాల మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు లేజర్ స్పీడ్గన్లతో నిఘా పెట్టింది. 44వ జాతీయ రహదారిపై ప్రమాద సూచికల వద్ద గంటకు 80 కిలోమీటర్ల కన్నా వేగంగా బండి నడిపితే.. స్పీడ్‌గన్ అటోమేటిక్‌గా గుర్తిస్తుంది. వాహన నంబర్ ఆధారంగా రూ.1035 జరిమానా విధిస్తూ.. చలాన్‌ను మెస్సేజ్ రూపంలో ఫోన్‌కు పంపుతున్నది. డిచ్పల్లి సర్కిల్ పరిధిలో నాలుగు బ్లాక్స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పరిమితికి మించి వేగంగా వాహనాలు నడుపుతుండడం వల్లే ప్రమాదాలు చోటుచేసు కుంటున్నాయని తేల్చారు. స్పీడ్గన్స్తోపాటు ఉమ్మడి జిల్లాలో 60కిలోమీటర్ల పొడవునా 254 ప్రమాద హెచ్చరిక బోర్డులను, 54 సోలార్ విగ్గర్స్ను ఏర్పాటు చేయడం సత్ఫలితాలను ఇస్తున్నది.
డిచ్పల్లి, సెప్టెంబర్ 3: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, వాహనాల వేగాన్ని అదుపులో పెట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ లేజర్ గన్‌తో నిఘాను ఏర్పాటు చేసింది. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన యాక్సిడెంటల్ జోన్ల వద్ద మాత్రమే లేజర్ గన్‌తో నిఘా పెట్టారు. ప్రమాదసూచికల సిగ్నల్ వద్ద వేగం 80 కిలోమీటర్లు దాటితే లేజర్ గన్ ఆటోమెటిక్‌గా ఆ వాహన ఫొటోను తీస్తుంది. వాహనం నంబర్ ఆధారంగా వాహనదారుడికి రూ.1,035 జురిమానా విధిస్తూ అతడి సెల్‌ఫోన్‌కు వాహనం ఫొటో, జరిమానా విధించిన చలాన్ మెసేజ్ రూపంలో వస్తుంది. దీంతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి యజమాని ఇంటి అడ్రస్‌కు పోస్టల్ ద్వారా చలాన్ కాపీ వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో మూడు చోట్ల మాత్రమే లేజర్ గన్‌తో ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనదారుల ఫొటోలు తీస్తూ జరిమానాలను విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా ఏసీపీ ట్రాఫిక్ ప్రభాకర్‌రావు, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తరచూ జాతీయ రహదారులపైన వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రహదారులపై లేజర్ గన్‌తో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి లేజర్ గన్ వినియోగంపై చైతన్య పరుస్తున్నారు. రహదారిపై నిబంధనలకు మించి అతివేగంగా వెళ్లే వాహనాలను లేజర్ గన్‌తో ఫొటోలు ఎలా తీయాలి..? కేసు ఎలా నమోదు చేయాలనే అంశాలపై ఏసీపీ ప్రభాకర్‌రావు అవగాహన కల్పించారు.
లేజర్ గన్ వినియోగంతో సత్ఫలితాలు..
జిల్లాలో లేజర్‌గన్ వినియోగంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వాహనదారుల ఓవర్ స్పీడ్‌కు అడ్డుకట్టవేసేందుకు దోహదపడుతున్నది. దీంతో సత్ఫలితాలను వస్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులు ప్రమాద సూచికల సిగ్నల్స్ వద్ద స్పీడ్‌ను తగ్గించి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 కిలోమీటర్ల పొడవున 254 ప్రమాద హెచ్చరిక బోర్డులను, 54 సోలార్ విగ్గర్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ కనీసం వందకు పైగా ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న వాహనాలను లేజర్ గన్ ఫొటోలను తీస్తున్నది.
ప్రమాదాల నివారణ కోసమే..
రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే జాతీయ రహదారులపై లేజర్ గన్ను వినియోగిస్తున్నాం. యాక్సిడెంటల్ జోన్ల వద్ద ఓవర్ స్పీడ్‌గా వెళ్తున్న వాహనదారులను లేజర్ గన్ గుర్తించి ఫొటోలను తీస్తున్నది. లేజర్ గన్ నుంచి తప్పించుకునేందుకు వాహనదారులకు ఎలాంటి అవకాశం లేదు. స్పీడ్ లిమిట్‌ను దాటిన ప్రతి వాహనాన్ని లేజర్ గన్ గుర్తిస్తుంది. దీని ద్వారా వాహనదారులు ట్రాఫిక్ నియమనిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరుగగకుండా ఉండే అవకాశం ఉంది.
డిచ్పల్లి సర్కిల్లో నాలుగు బ్లాక్ స్పాట్లు..
డిచ్పల్లి సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు బ్లాక్ స్పాట్లను గుర్తించాం. అందులో బీబీపూర్ తండా (మోడల్ స్కూల్) వద్ద, 44వ నంబర్ జాతీయ రహదారి డిచ్పల్లి ఏడో బెటాలియన్ వద్ద, సికింద్రాపూర్, అర్గుల్ వద్ద బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున లేజర్ గన్‌తో నిఘాను ఏర్పాటు చేశాం. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం..
రహదారులపై ఏర్పాటు చేసిన లేజర్ గన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు అవగాహన కల్పించాం. వాహనాలను ఫొటో తీసే విధానం, ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధానంపై ఇదివరకే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాం. దీంతో రహదారులపై ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.