శంకుస్థాపనకు హాజరైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు
ప్రారంభోత్సవంలో కేసీఆర్ వెన్నంటే ఉన్న మంత్రి వేముల తెలంగాణ భవన్ భూమిపూజలో ఉమ్మడి జిల్లా నేతలు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయానికి సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. కార్యక్రమానికి హాజరైన వారిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, షకీల్, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు ఉన్నారు.