మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimhaswamy Temple) మూలమూర్తులకు గ్రామానికి చెందిన పాత కిష్టయ్య జ్ఞాపకార్థం రెండు కిరీటాలు అందజేశారు. శనివారం వారి కుటుంబ సభ్యులు పాత లక్ష్మీరాజం, పండరి ,రమేష్ అశోక్ కిలో వెండితో స్వామివారికి తయారు చేయించిన రెండు కిరీటాలకు ( Two crowns ) పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా దాతలను ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, అర్చకులు ఉన్నారు.