కామారెడ్డి : కామారెడ్డి ( Kamareddy ) పట్టణ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట దొంగల ముఠా (robbery gang) సభ్యులను అరెస్టు చేశారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సి పట్టణానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్ , షేక్ వాజిద్ అనే ఇద్దరు దొంగలు మూడు సంవత్సరాలుగా కామారెడ్డి పట్టణం, దేవునిపల్లి ప్రాంతాల్లో ఇండ్లలో సుమారు 40 ఇండ్లలో దొంగతనాలు చేశారని పోలీసులు వివరించారు.
దొంగిలించిన సొత్తును దెగ్లూర్ ఏరియాలో అమ్ముతున్నారని తెలిపారు. శనివారం కామారెడ్డిలో దొంగతనం చేసేందుకు రాగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఇద్దరిని పట్టుకుని విచారించడగా చేసిన దొంగతనాలను వివరించారని తెలిపారు.దొంగలను పట్టుకోవడంలో కామారెడ్డి సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై ఉస్మాన్, సిబ్బంది సురేందర్, రవి, గణపతి, శ్రవణ్, రాజేందర్, కిషన్ కృషి చేశారని, వీరిని జిల్లా ఎస్పీ , ఏఎస్పీ అభినందించారని వెల్లడించారు.