కామారెడ్డి డీఎంహెచ్వో సస్పెన్షన్
కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్సింగ్పై సస్పెన్షన్ వేటుపడింది. మహిళా వైద్యులను లైంగికంగా వేధించినట్లు తేలడంతో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్యశాఖ కార్యదర్శి
కామారెడ్డి, మే 25: కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్సింగ్పై సస్పెన్షన్ వేటుపడింది. మహిళా వైద్యులను లైంగికంగా వేధించినట్లు తేలడంతో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. తమపై డీఎంహెచ్వో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని 15 రోజుల క్రితం పీహెచ్సీలో పనిచేస్తున్న మహిళా మెడికల్ ఆఫీసర్లు ఉన్నతాధికారులతోపాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
అనంతరం దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 15న ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ కామారెడ్డి వచ్చి విచారణ చేపట్టారు. అదే రోజు సాయంత్రం పోలీసులు డాక్టర్ లక్ష్మణ్సింగ్ను అదుపులోకి తీసుకొని 16న కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్పై బయటికి వచ్చారు. విచారణ అధికారితోపాటు కలెక్టర్, ఎస్పీ ఇచ్చిన నివేదికతో డీఎంహెచ్వోను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

