బీబీపేట : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ( Collector Sangwan) శుక్రవారం బీబీపేట జడ్పీహెచ్ఎస్ (Bibipet ZPHS) పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించారు. పదవతరగతి విద్యార్థులకు ఇస్తున్నశిక్షణను అడిగి తెలుసుకున్నారు. రాబోయే టెన్త్ పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
మధ్యాహ్న భోజనం ( Midday Meals) గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల మొత్తం కలియ తిరిగి అక్కడి పరిస్థితులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట హెచ్ఎం రవీంద్రారెడ్డి , మండల విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులున్నారు.
అనంతరం గ్రామపంచాయతీకి సంబంధించిన ఓపెన్ వెల్‌ను పరిశీలించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను కలెక్టర్ పరిశీలించారు. జడ్పీ సీఈవో చందర్ నాయక్ , మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ తదితర అధికారులు ఉన్నారు.