రుద్రూర్ : జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) జన్మదిన వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రుద్రూర్ మండల (Rudruru Mandal) కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కవిత పార్లమెంట్ సభ్యురాలిగా, ఎమ్మెల్సీగా జిల్లాకు చేసిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఇన్చార్జి గాండ్ల మధు, కన్నె ప్రవీణ్, హరీష్, కొండలవాడి సాయికిరణ్, కర్రోల్ల వెంకట్, షేక్ షాదుల్ , తదితరులు పాల్గొన్నారు.