వినాయక్‌నగర్, మే 1: ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా అమలుచేస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా సేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో మేడే సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కార్మికుల దరి చేరాలని సూచించారు.
అదనపు జడ్జిలు ఆశాలత, హరీశ మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయభాస్కర్‌రావు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సాయారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్‌రాజు, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, సంస్థ పర్యవేక్షకురాలు శైలజారెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.