Kotagiri | అద్భుతాలు సృష్టించేది ఇంజినీరే.. కోటగిరి ఎంపీడీవో విష్ణు
ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది కేవలం ఇంజినీరే అని కోటగిరి ఎంపీడీవో విష్ణు అన్నారు. జాతీయ ఇంజనీర్స్ డే, భారత నిర్మాణానికి కృషి చేసిన నవభారత నిర్మాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ ఇంజినీర్స్ డే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
- కోటగిరిలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
Kotagiri | కోటగిరి, సెప్టెంబర్ 15 : ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది కేవలం ఇంజినీరే అని కోటగిరి ఎంపీడీవో విష్ణు అన్నారు. జాతీయ ఇంజనీర్స్ డే, భారత నిర్మాణానికి కృషి చేసిన నవభారత నిర్మాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ ఇంజినీర్స్ డే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు శాఖల ఇంజినీరులకు శాలువా మెమోంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సాగు తాగునీటి ప్రాజెక్టులతో భారత నిర్మాణానికి కృషి చేసిన నవభారత నిర్మాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు.
దేశ అభివృద్ధికి ముఖ్యంగా మౌలిక వసతులు నీటిపారుదల వ్యవస్థల ఆనకట్టల డ్యామ్ నిర్మాణానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఏఈ నవదీష్ గౌడ్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఏఈ, ధనరాజ్, నీటిపారుదల శాఖ ఏఈ రవికుమార్, విద్యుత్ శాఖ ఏఈ బుజ్జి బాబు, సబ్ ఇంజనీర్ సుమీదను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి, కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, కోటగిరి సహకార సంఘం అధ్యక్షుడు కూచీ సిద్ధు, కోటగిరి లైన్స్ క్లబ్ సభ్యులు హన్మంతురావు, పోల అశ్విన్ కుమార్, అనిల్ కుమార్, దమ్మలపాటి ఉదయ్, బీర్కూరు శ్యామ్ కుమార్, హౌగిరావ్ పటేల్, లైన్ మ్యాన్ వైద్యనాథ్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ శివ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

