రెంజల్, నవంబర్ 24 : మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడైన నేపథ్యంలో తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తివేశారు.
రెంజల్ మండలం కందకుర్తి, సాలూరా మండల సరిహద్దు, బోధన్ మండలం ఖండ్గాం, పొతంగల్, అంతరాష్ట్ర శివారు గ్రామాల సరిహద్దు, మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా బెల్లూర్ గ్రామం వద్ద గత నెల 17న ఇరు రాష్ర్టాల ఉన్నతాధికారులు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.