డిచ్పల్లి/ సిరికొండ/ రుద్రూర్/డిచ్పల్లి, మార్చి 8 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. డిచ్పల్లిలోని టీయూ గర్ల్స్ హాస్టల్లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వంట చేసే మహిళలను టీయూ కార్యదర్శి జయంతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సిరికొండ మండలంలోని రావుట్లలో పీవోడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పిట్ల రమ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రధానిక మోదీ అవలంబిస్తున్న కార్మిక, కర్షక తదితర వాటికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. రుద్రూర్‌లోని ఫుడ్‌సైన్స్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బొప్పాపూర్‌లో కాంగ్రెస్ నాయకులు మహిళలను సన్మానించారు. డిచ్పల్లి మండలంలోని బర్ధిపూర్‌లో ఉన్న సీఎస్ఐ వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైబిల్లోని స్త్రీల గురించి సంఘకాపరి దివాకర్ సందేశమిచ్చారు. అనంతరం మహిళలను సన్మానించారు.
ఆర్మూర్‌టౌన్, మార్చి8: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మోహన్ దాస్, సంఘం అధ్యక్షుడు వేముల ప్రకాశ్ ఆధ్వర్యంలో పద్మశాలీ సంఘం మహిళలను సన్మానించారు.