నిజామాబాద్ స్పోర్ట్స్, డిసెంబర్ 20: అంతర్జాతీయ బాక్సర్ హుసాముద్దీన్ అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులను బుధవారం ప్రకటించింది. జనవరి 9న రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి నుంచి జిల్లాకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్ అర్జున అవార్డును అందుకోనున్నారు. హుసాముద్దీన్కు అర్జున అవార్డు రావడంపై జిల్లావాసులు, క్రీడాకారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఖలీల్వాడీ, డిసెంబర్ 20 : షూటింగ్, బాక్సింగ్ విభాగంలో అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణకు చెందిన ఈషాసింగ్, మహ్మద్ హుసాముద్దీన్లకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మీ ప్రతిభ, కృషి, ప్రపంచ వేదికపై దేశానికి కీర్తిని తెచ్చి పెట్టాయని అభినందించారు